అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-08-02T00:23:53+05:30 IST
పట్టణంలోని కొండకవీధి సమీపంలో ఓ వెండి షాపు యజ మాని సత్యనారాయణ తన షాపులోనే మృతిచెందాడు.
రాజాం రూరల్: పట్టణంలోని కొండకవీధి సమీపంలో ఓ వెండి షాపు యజ మాని సత్యనారాయణ తన షాపులోనే మృతిచెందాడు. మంగళవారం రాత్రి పది గంటల తర్వాత షాపులో లైట్లు వెలిగి ఉండడాన్ని గమనించిన స్థానికులు షాపు లోకి వెళ్లి చూడగా, సత్యనారాయణ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే 108 వాహనానికి సమాచారం అందజేశారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని రాత్రి 11 గంటల సమయంలో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ స్వస్థలం పెద్దాపురం. 15 ఏళ్లు క్రితం రాజాం వచ్చి వెండి పట్టీలు తయారు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. మతుడికి భార్య ఈశ్వరమ్మతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. కేసు నమోదు కావాల్సి ఉంది. సత్యనారాయణ మృతిపై అనుమానాలు వినిపిస్తున్నాయి.