ఆరు రోడ్లకు అనుమతి
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:00 AM
గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోని ఆరు రోడ్లకు జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) అనుమతిఇచ్చింది. కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధ్యక్షతన కమిటీ రెవెన్యూ, అటవీ, గిరి జన సంక్షేమశాఖలతో కూడిన సంయుక్త తనిఖీ నివే దికను పరిశీలించింది. ఆయా గ్రామాలను ప్రధాన స్రవం తిలోకి అనుసంధానించడానికి, గిరిజనులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పినంచడానికి దాని ప్రాముఖ్యత దృష్ట్యా రోడ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.ఆరు రోడ్ల కోసం గిరిజన సంక్షేమ కార్యనిర్వాహక ఇంజినీర్ ప్రతిపాదనలు సమర్పిం చారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని బబ్బిడి, బీటీరోడ్డు నుంచి రావివలసకు వరకు 0.314 హెక్టార్లు, కూసా- నోండ్రుకోన రహదారి నుంచి యెడకల్లు వరకు 0.300 హెక్టార్లలో,కురుపాం మండలం సవరగడూ జంక్షన్ నుంచి బండిగూడ వరకు 0.93 హెక్టార్లు తెన్నుఖర్చ నుంచి గొటి వాడ వరకు 0.95 హెక్టార్లకు అవసరమైన అనుమతులు మంజూరు చేశారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగా నికి ఇప్పటివరకు 13 అటవీ అనుమతులు లభించాయి. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్, జిల్లా అటవీశాఖ అధికారి జీఏపీ ప్రసూన పాల్గొన్నారు.
పార్వతీపురం ఆంధ్రజ్యోతి: గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోని ఆరు రోడ్లకు జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) అనుమతిఇచ్చింది. కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధ్యక్షతన కమిటీ రెవెన్యూ, అటవీ, గిరి జన సంక్షేమశాఖలతో కూడిన సంయుక్త తనిఖీ నివే దికను పరిశీలించింది. ఆయా గ్రామాలను ప్రధాన స్రవం తిలోకి అనుసంధానించడానికి, గిరిజనులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పినంచడానికి దాని ప్రాముఖ్యత దృష్ట్యా రోడ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.ఆరు రోడ్ల కోసం గిరిజన సంక్షేమ కార్యనిర్వాహక ఇంజినీర్ ప్రతిపాదనలు సమర్పిం చారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని బబ్బిడి, బీటీరోడ్డు నుంచి రావివలసకు వరకు 0.314 హెక్టార్లు, కూసా- నోండ్రుకోన రహదారి నుంచి యెడకల్లు వరకు 0.300 హెక్టార్లలో,కురుపాం మండలం సవరగడూ జంక్షన్ నుంచి బండిగూడ వరకు 0.93 హెక్టార్లు తెన్నుఖర్చ నుంచి గొటి వాడ వరకు 0.95 హెక్టార్లకు అవసరమైన అనుమతులు మంజూరు చేశారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగా నికి ఇప్పటివరకు 13 అటవీ అనుమతులు లభించాయి. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్, జిల్లా అటవీశాఖ అధికారి జీఏపీ ప్రసూన పాల్గొన్నారు.