పెద్దవలస పంచాయతీని ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2023-09-25T23:59:58+05:30 IST

నార్లవలస పంచాయతీని విడదీసి పెద్దవలస కేంద్రంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తూ సోమవారం ధర్నా చేశారు.

పెద్దవలస పంచాయతీని ఏర్పాటు చేయాలి

సాలూరు రూరల్‌: నార్లవలస పంచాయతీని విడదీసి పెద్దవలస కేంద్రంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తూ సోమవారం ధర్నా చేశారు. గిరిజన సంఘం నేత వంతల సుందరరావు ఆధ్వర్యంలో పెద్దవలస, భరణికివలస, బొడ్డపాడు, జిల్లేడువలస, సీతందొరవలస, బొర్రపణుకువలస, దబ్బచదును గ్రామాల గిరిజనులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రస్తుత పంచాయతీ నార్లవలస తమ గ్రామాలకు దూరంగా ఉండడం వల్ల వ్యయ ప్రయాసలకు లోనవుతున్నామని వారు వాపోయారు. గిరిజన సంఘ నేత సుందరరావు మాట్లాడుతూ తమ గ్రామాలను సమీప పంచాయతీ కేంద్రాల్లో కాకుండా దూరంలో ఉన్న నార్లవలసలో అప్పట్లో మ్యాపింగ్‌ చేయడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తమ గ్రామాలను వీడదీసి పెద్దవలస కేంద్రంగా నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత మర్రి శ్రీనివాసరావు, గాసి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:59:58+05:30 IST