కనీస వేతనం ఇవ్వండి
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:16 AM
ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు జిల్లా వ్యాప్తంగా గురువారం ధర్నా చేపట్టారు.
ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు జిల్లా వ్యాప్తంగా గురువారం ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, తెలంగాణ తరహాలో టైం స్కేలు వర్తింపజేయాలని, బీఎల్వో విధుల నుంచి తమను తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్యాయంగా తమ నుంచి వసూలు చేసిన డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. నామినీలుగా చేస్తున్న వీఆర్‌ఏలను రెగ్యులర్ చేయాలని, అర్హూలైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందజేశారు.
(ఆంధ్రజ్యోతి బృందం)