ధాన్యం సొమ్ములు చెల్లించండి

ABN , First Publish Date - 2023-02-06T23:40:23+05:30 IST

రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, సొమ్ములు కూడా తక్షణమే చెల్లించాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ డిమాండ్‌ చేశారు.

ధాన్యం సొమ్ములు చెల్లించండి

- మార్చి నెలాఖరు వరకు కొనుగోలు చేయండి

- టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి జయకృష్ణ

- సబ్‌కలెక్టరేట్‌ వద్ద నిరసన

పాలకొండ: రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, సొమ్ములు కూడా తక్షణమే చెల్లించాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ డిమాండ్‌ చేశారు. రైతుల వద్ద నుంచి మార్చి నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. సోమవారం పాలకొండలోని సబ్‌కలెక్టరేట్‌ వద్ద ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ బస్తాకు ఐదు కేజీల ధాన్యాన్ని మిల్లర్లు అదనంగా తీసుకుంటున్నారని, వాటిని రికవరీ చేసి రైతులకు అందజేయా లని కోరారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌కు వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు గండి రామి నాయుడు, నాయకులు చేబోదుల లక్ష్మీనారా యణ, శాసపు సుగుణాకర్‌రావు, జాడ శ్రీధర్‌, పొట్నూరు గౌరునాయుడు, కోట సంగంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

పాలకొండ: టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ పాల కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎన్‌కేరాజపురంలోని 3,5 వార్డుల్లో ఇదేమి ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కర్నేన అప్పల నాయుడు, పార్టీ అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు పల్లా కొండబాబు, నాయ కులు గంటా సంతోష్‌, గండి రామినాయుడు, వెన్నపు శ్రీనివాసరావు, సుంకరి అనీల్‌దత్‌, అడబా బాబ్జీ, అంపోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీతంపేట: ప్రభుత్వ నిధులను మళ్లించి సొంత పనులకు ఉప యోగించుకుంటున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆరోపించారు. సోమవారం సీతం పేటలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమం లోటీడీపీ మండలాధ్యక్షుడు సవర తోటముఖలింగం, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బిడ్డిక దమయంతి నాయుడు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, సర్పంచ్‌ బిడ్డిక అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:40:24+05:30 IST