Share News

టీడీపీ కార్యాలయం ప్రారంభం

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:52 PM

పార్వతీ పురంలో టీడీపీ నియో జకవర్గ కార్యాలయాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆదివారం ప్రారంభించా రు.

 టీడీపీ కార్యాలయం ప్రారంభం

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: పార్వతీ పురంలో టీడీపీ నియో జకవర్గ కార్యాలయాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆదివారం ప్రారంభించా రు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విజయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి, పార్టీ అరకు పార్లమెంటు అధ్యక్షుడు శ్రావణ్‌, కురుపాం, పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జిలు తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణతో పాటు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు చెందిన సీనియర్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధాన పార్టీ కార్యాలయాన్ని కళా వెంకటరావు ప్రారంభించగా, ఇన్‌చార్జి కార్యాల యాన్ని బేబీ నాయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం, బిలిజిపేట మండల అధ్యక్షులు బోనుదేవి చంద్రమౌళి, పెంకి వేణుగోపాలనాయుడు, సీతా నగరం మండల ప్రధాన కార్యదర్శి వేణు, అరకు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షు డు గొట్టాపు వెంకటనాయుడు, కౌన్సిలర్లు బడే గౌరునాయుడు, నారాయణరావు, మాజీ కౌన్సిలర్‌ సీతారాంతో పాటు నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు.

పార్వతీపురంలోని నూతన టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర కేక్‌ను కట్‌ చేసి, ప్రతిఒక్కరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Dec 24 , 2023 | 11:52 PM