జీగిరాం జూట్‌ మిల్లు తెరవండి

ABN , First Publish Date - 2023-09-04T00:13:51+05:30 IST

జీగిరాం గ్రామంలోని జూట్‌ మిల్లును తెరిపించి కార్మికులను ఆదుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పట్టణంలోని పెన్షనర్ల కార్యాలయంలో ఆదివారం జూట్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

జీగిరాం జూట్‌ మిల్లు తెరవండి
మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి

- 7 భారీ ర్యాలీ

- అఖిలపక్ష నాయకుల హెచ్చరిక

సాలూరు, సెప్టెంబరు 3: జీగిరాం గ్రామంలోని జూట్‌ మిల్లును తెరిపించి కార్మికులను ఆదుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పట్టణంలోని పెన్షనర్ల కార్యాలయంలో ఆదివారం జూట్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. జూట్‌ ఫ్యాక్టరీని తెరిపించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. దీంతో 1200 మంది కార్మికులు కుటుంబాలతో రోడ్డున పడ్డారన్నారు. ఉపాధిని ఇచ్చే పరిశ్రమ విషయంలో యాజ మాన్యం, అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. మూతపడిన పరిశ్రమలనే తెరిపించలేని ఈ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను ఎలా తెస్తుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌, బీజేపీ నాయకుడు అప్పలనాయుడు, కాంగ్రెస్‌ నేత బంగారయ్యలు.. మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 7న జరిగే ఆందోళనకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ నెల 7న అఖిల పక్షంతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్య క్షుడు నిమ్మాది తిరుపతిరావు, ఏపీటీఎఫ్‌ సాలూరు, పాచిపెంట నాయకులు గౌరీ శంకరరావు, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు టి.రాముడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:13:51+05:30 IST