మరోసారి

ABN , First Publish Date - 2023-04-03T23:59:31+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ అందించే టైం మరోమారు మారింది. ఒంటి బడులు నేపథ్యంలో మంగళవారం నుంచి పాఠశాలల్లో ఉదయం 10.10 గంటలకు అందించాలని విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోసారి
రాగిజావ తాగుతున్న విద్యార్థులు ( ఫైల్‌ )

ఉదయం 10.10 గంటలకు ఇవ్వాలని ఆదేశాలు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 3: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ అందించే టైం మరోమారు మారింది. ఒంటి బడులు నేపథ్యంలో మంగళవారం నుంచి పాఠశాలల్లో ఉదయం 10.10 గంటలకు అందించాలని విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టకేలకు గత నెల 21న ఉదయం 11 గంటలకు రాగిజావను అందించారు. అనంతరం రెండోరోజు గత నెల 23న ఉదయం 8.45 గంటలకు పంపిణీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఉపాధ్యాయ సంఘాలు కోరిన మేరకు విరామ సమయంలో రాగిజావను అందించే విధంగా రివైజ్డ్‌ ఆదేశాలు వెలువడ్డాయి. ఉదయం 10.35 గంటలకు, ఉన్నత పాఠశాలల్లో ఉదయం 10.45 గంటలకు అందించారు. ప్రస్తుతం ఒంటిపూట సెలవులు కావడంతో మళ్లీ రాగిజావ పంపిణీపై రివైజ్డ్‌ ఆదేశాలను విద్యాశాఖ జారీ చేసింది. ఈ జావను ఉదయం 10.10 నుంచి 10.25 మధ్య రాగిజావను విద్యార్థులు తాగే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1495 పాఠశాలల్లో దాదాపు 80 వేల మంది విద్యార్థులకు రాగిజావను అందిస్తున్నారు.

Updated Date - 2023-04-03T23:59:31+05:30 IST