రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2023-10-30T01:27:05+05:30 IST
మండలంలో సంకిలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పాపు రం గ్రామానికి చెందిన కొంకు సూరయ్య (71) మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. అప్పాపురం గ్రామానికి చెందిన సూరయ్య పాలకొండలో ఓ రైస్‌మిల్లులో కళాసిగా పనిచేస్తున్నాడు.
రేగిడి: మండలంలో సంకిలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పాపు రం గ్రామానికి చెందిన కొంకు సూరయ్య (71) మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. అప్పాపురం గ్రామానికి చెందిన సూరయ్య పాలకొండలో ఓ రైస్‌మిల్లులో కళాసిగా పనిచేస్తున్నాడు. ఉదయం మిల్లు విధులకు హాజరైన ఆయన పనిము గించుకొని తన ద్విచక్రవాహనంపై స్వగ్రామం వస్తుండగా సంకిలి వద్ద సెల్ఫ్‌యాక్సి డెంట్‌కు గురై తలభాగం రోడ్డుకు తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికు లు 108లో పాలకొండ ఏరియా ఆసుపత్రికి చికిత్సకు తరలించగా పరిస్థితి విష మించి మృతిచెందాడు.సూరయ్యకు భార్య విజ యలక్ష్మి, కుమారులు వసంతరావు, హరి ఉన్నారు. సూరయ్య మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు హెచ్‌సీ శ్రీనివాసరా వు తెలిపారు.