బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ABN , First Publish Date - 2023-03-18T23:41:42+05:30 IST
మండలంలోని సంకిలిలో ఓ బాల్య వివాహన్ని అధికారులు అడ్డుకు న్నారు.

రేగిడి: మండలంలోని సంకిలిలో ఓ బాల్య వివాహన్ని అధికారులు అడ్డుకు న్నారు. పాలకొండ మండలంలోని పనుకువలసకు చెందిన 13 ఏళ్ల బాలికను సంకిలికి చెందిన 21 ఏళ్ల వ్యక్తితో శనివారం వివాహం చేయడానికి నిర్ణయించా రు. ఈ వివాహంపై శ్రీకాకుళం కాల్‌సెంటర్‌కు ఫిర్యాదువెళ్లింది. దీంతో శ్రీకాకుళం చైల్డ్‌లైన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నర్సింగరావు, టీమ్ సభ్యులు రమేష్, రాంబాబు, ఎంపీడీవో జి.కాశీవిశ్వనాఽథరావు, రాజాం ఐసీడీఎస్ ఏసీడీపీవో సిమ్మాలమ్మ, పంచాయతీ కార్యదర్శి గోపి, కానిస్టేబుల్ మహేష్, మహిళా పోలీస్ స్వాతి, అంగన్‌వాడీ సిబ్బంది పెళ్లి జరిగే చోటికి చేరుకున్నారు. వఽధువు, వరుడుతోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్యవివాహం చట్టరీత్య నేరమని పెళ్లి నిలిపివేయాలని తల్లిదండ్రులు, వరుడు, వదువు నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. అనంతరం వివాహం నిలిపివేశారు.