మేతకోసం ఒడిశాకు..

ABN , First Publish Date - 2023-06-01T00:19:26+05:30 IST

వేసవిలో పశువులకు గ్రాసం కరువైంది. ఎండు గడ్డి, పచ్చగడ్డి ఏదికూడా దొరక్కపోవడంతో పశువులు బక్కచిక్కిపోతున్నాయి. దీంతో వాటి పోషణ యజమానులకు భారంగా మారింది. మేత కోసం వాటిని ఒడిశా, తదితర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మేతకోసం ఒడిశాకు..

వేసవిలో పశువులకు గ్రాసం కరువైంది. ఎండు గడ్డి, పచ్చగడ్డి ఏదికూడా దొరక్కపోవడంతో పశువులు బక్కచిక్కిపోతున్నాయి. దీంతో వాటి పోషణ యజమానులకు భారంగా మారింది. మేత కోసం వాటిని ఒడిశా, తదితర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంగర మండలంలోని పట్టువర్థనం, బంగారువలస, మగ్గూరు, బాగెమ్మపేట గ్రామాల్లోని ఆవులకు గ్రాసం కరువైంది. ఎండలకు పొలాల్లో గడ్డిపూచ కూడా మొల కెత్తడం లేదు. ఎటుచూసినా దుర్భిక్షమే నెలకొంది. దీంతో మేత కోసం ఈ గ్రామాల నుంచి వందలాది పశువులను ఒడిశాతో పాటు తోటపల్లి, కొమరాడ, పార్వతీపురం తదితర ప్రాంతాలకు తోలుకెళ్తున్నట్లు యజమానులు బంగాయర్య, సూరయ్య, శివుడు, సన్యాసినాయుడు తదితరులు తెలిపారు. వర్షాలు కురిసిన తరువాత ఆవులతో మళ్లీ సొంత గ్రామాలకు వస్తామని చెబుతున్నారు.

-వంగర

Updated Date - 2023-06-01T00:19:26+05:30 IST