ఆడలి వ్యూపాయింట్‌ పనులు వేగవంతం: పీవో

ABN , First Publish Date - 2023-09-23T00:21:45+05:30 IST

ఐటీడీఏ పరిధిలోని పర్యాటక ప్రాంతం ఆడలి వ్యూ పాయింట్‌ పనులను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో కల్పనా కుమారి ఆదేశించారు.

ఆడలి వ్యూపాయింట్‌ పనులు వేగవంతం: పీవో

సీతంపేట: ఐటీడీఏ పరిధిలోని పర్యాటక ప్రాంతం ఆడలి వ్యూ పాయింట్‌ పనులను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో కల్పనా కుమారి ఆదేశించారు. శుక్రవారం వ్యూ పాయింట్‌ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. ప్లానింగ్‌లో ఎటువంటి మార్పులు చేయకూడదన్నారు. జేఈ నాగభూషణ్‌, ఇతరసిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-09-23T00:21:45+05:30 IST