Share News

కౌన్సిల్‌ సభ్యుల అడ్డగింత

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:09 AM

పారిశుధ్య కార్మికుల సమ్మెలో భాగంగా శనివారం బొబ్బిలిలో మున్సిపల్‌ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. సమావేశానికి వెళ్లకుండా కౌన్సిల్‌ సభ్యులను అడ్డుకున్నారు. ఒకానొక దశలో చైర్మన్‌ను నిలదీశారు. కార్మికులు కొద్దిరోజులుగా సమ్మెలో ఉన్న విషయం తెలిసిందే.

కౌన్సిల్‌ సభ్యుల అడ్డగింత
మున్సిపల్‌ చైర్మన్‌ను అడ్డుకుంటున్న పారిశుధ్య కార్మికులు

కౌన్సిల్‌ సభ్యుల అడ్డగింత

పారిశుధ్య కార్మికుల ఆందోళన తీవ్రతరం

బొబ్బిలిలో చైర్మన్‌తో వాగ్వాదం

బొబ్బిలి, డిసెంబరు 30: పారిశుధ్య కార్మికుల సమ్మెలో భాగంగా శనివారం బొబ్బిలిలో మున్సిపల్‌ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. సమావేశానికి వెళ్లకుండా కౌన్సిల్‌ సభ్యులను అడ్డుకున్నారు. ఒకానొక దశలో చైర్మన్‌ను నిలదీశారు. కార్మికులు కొద్దిరోజులుగా సమ్మెలో ఉన్న విషయం తెలిసిందే. నిత్యం వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా శనివారం మున్సిపల్‌ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. కౌన్సిల్‌ సమావేశం ఉన్నందున సభ్యులు ఒక్కొక్కరూ వస్తుండగా వారిని కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని పట్టుబట్టారు. అంతలో చైర్మన్‌ సావు వెంకటమురళీకృష్ణారావు రాగా అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఇక్కడ ఆందోళన చేయడం సరికాదని చైర్మన్‌ అనడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని వారించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు పి.శంకరరావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అందరినీ రెగ్యులర్‌ చేయాలని కోరారు.

- కార్మికులంతా సమ్మెలో ఉండగా ప్రైవేట్‌ డ్రైవర్‌ను నియమించి చెత్తను తరలించే ఏర్పాట్లు చేయడాన్ని కార్మికులు అడ్డుకున్నారు. స్థానిక ఎన్టీఆర్‌ జంక్షన్‌లో చెత్త లారీని చాలాసేపు కదలనీయలేదు.

Updated Date - Dec 31 , 2023 | 12:09 AM