దసరాలో దుర్గమ్మకు కొత్త అలంకారం
ABN , First Publish Date - 2023-09-20T02:56:58+05:30 IST
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 15వ తేదీ నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.

శుద్ధపంచమి రోజున మహాచండీదేవి అవతారం
విజయవాడ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 15వ తేదీ నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. కాగా, ఈసారి దసరా మహోత్సవాల్లో కనకదుర్గమ్మకు కొత్త అలంకారం చేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారాన్ని తొలగించారు. ఆ స్థానంలో శుద్ధపంచమి అనగా 19వ తేదీన అమ్మవారిని మహాచండీదేవిగా అలంకరిస్తారు. ఈ విషయాన్ని దుర్గామల్లేశ్వరస్వామి అధికారులు, ధర్మకర్తల మండలి, వైదిక కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.