నగర పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి
ABN , First Publish Date - 2023-09-23T00:27:48+05:30 IST
నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆ కార్మికుల సంఘం నాయకుడు బాబూరావు డిమాండ్ చేశారు.
నెల్లిమర్ల: నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆ కార్మికుల సంఘం నాయకుడు బాబూరావు డిమాండ్ చేశారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమ డిమాండ్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. ఈనెల 24 వరకు నల్లబాడ్జీలతో విధులకు హాజరవుతామని, అప్పటికీ పరిష్కరించకపోతే 25 నుంచి నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్మికులకు రక్షణ పరికరాలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో హరిబాబు, శ్రీను, దుర్గారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.