నా భూమిని ఆక్రమించారు
ABN , First Publish Date - 2023-06-26T00:23:42+05:30 IST
తనకు చెందిన భూమిని వైసీపీ సర్పంచ్ ప్రతినిఽధి డబ్బాడ వెంకటరమణ ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ వీఆర్ అగ్రహా రం గ్రామానికి చెందిన జనపాల శ్రీధర్ ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేశారు.
రాజాం రూరల్: తనకు చెందిన భూమిని వైసీపీ సర్పంచ్ ప్రతినిఽధి డబ్బాడ వెంకటరమణ ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ వీఆర్ అగ్రహా రం గ్రామానికి చెందిన జనపాల శ్రీధర్ ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజాం సీఐ రవికుమార్ ఆదివారం రాత్రి డబ్బాడ వెంకటరమణపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. వీఆర్ అగ్రహారం గ్రామం లో జనపాల శ్రీధర్‌కు 72 సెంట్లు భూమి ఉందని, ఆ భూమి అతనికే చెందుతుం దని గతంలో రెవెన్యూ యంత్రాంగం ధ్రువీకరించిందని సీఐ తెలిపారు. అయితే ఇటీవల శ్రీధర్ తనకు చెందిన భూమిని చదును చేసేందుకు వెళ్లే సమయంలో వెంకటరమణ అడ్డుకుని తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు.