‘పది’లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , First Publish Date - 2023-09-25T23:58:19+05:30 IST
పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లావృత్తి విద్యాశాఖ అధికారి మంజులవీణ సూచించారు.

పాలకొండ: పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లావృత్తి విద్యాశాఖ అధికారి మంజులవీణ సూచించారు. సోమవారం పాలకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతున్న నాడు-నేడు పథకం కింద కళాశా లలో చేపట్టిన బాలబాలికల మరుగుదొడ్లు, శుద్ధ తాగునీటి ప్లాంట్లను పరిశీలిం చారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్ర మంలో కళాశాల ప్రిన్సిపాల్ పైల శంకరరావు, సీనియర్ అధ్యాపకులు తేజేశ్వరరావు, గోవిందరావు, ఇంజినీర్ వావిలపల్లి రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ పీవో వెలమల అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.