భోపాల్‌కు గంజాయి తరలింపు
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:09 AM
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నుంచి మధ్యప్రదేశ్ లోని భోపాల్‌కు గంజాయి తరలిస్తున్న నలుగురిని సాలూరు రూరల్ ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి అరెస్ట్ చేశారు.
సాలూరు రూరల్: ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నుంచి మధ్యప్రదేశ్ లోని భోపాల్‌కు గంజాయి తరలిస్తున్న నలుగురిని సాలూరు రూరల్ ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ కథనం మేరకు.. కోరాపుట్ జిల్లా బైపరిగుడ బ్లాక్‌కు చెందిన సర్గిగూడ, మఝిగుడలకు చెందిన బనమాలి పరజ, గురు పరజ, కమల్‌లోచన్, హరిచందన్ కర్లియాలు 27 కిలోల గంజాయిని ఆటోలో తరలిస్తున్నారు. వారు ఆటోలో గంజాయిని బట్టల మూటల్లో దాచారు. దండిగాం జంక్షన్ వద్ద శనివారం సాలూరు రూరల్ ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి వాహన తనిఖీలు చేశారు. ఈ సమయంలో ఆటోలో వస్తున్న వారిని ప్రశ్నించ గా వారి సమాధానాలు తేడాగా ఉండడంతో మూటలను సోదా చేశారు. ఈ సోదాల్లో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో గంజాయి స్వాధీనం చేసు కుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.