బోయ, వాల్మీకిలను ఎస్టీలో చేర్చితే ఉద్యమం
ABN , First Publish Date - 2023-04-03T00:34:51+05:30 IST
బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చితే ఉద్యమం తప్పదని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ తెలిపారు.
సీతంపేట: బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చితే ఉద్యమం తప్పదని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ తెలిపారు. ఆదివారం సీతంపేటలోని సామా జిక భవనంలో ఆదివాసీ సంఘ నాయకులు, టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లా డుతూ ఇప్పటికే గిరిజనులకు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నారు. మూడేళ్లుగా అభివృద్ధి జాడలేదని ఆరోపించా రు. మైదాన ప్రాంతాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన బోయ, వాల్మీకిలను ఎస్టీలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానిం చడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణను నిర్ణయించి నిరసనలు చేపతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ ప్రజాప్రతినిధులు, అన్ని సంఘాల సభ్యులు, ఉద్యోగులు, యువత పాల్గొన్నారు.