డంపింగ్‌యార్డును తరలించండి
ABN , First Publish Date - 2023-11-06T00:13:17+05:30 IST
పట్టణంలో వివిధ పన్నులతో పాటు చెత్త పన్ను విధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్‌యార్డును తరలించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర విమర్శలు గుప్పించారు.
పార్వతీపురంటౌన్: పట్టణంలో వివిధ పన్నులతో పాటు చెత్త పన్ను విధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్‌యార్డును తరలించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర విమర్శలు గుప్పించారు. గుడ్ మార్నింగ్ పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న డంపింగ్‌యార్డును పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఆదివారం ఉదయం పరిశీలించారు. డంపింగ్‌యార్డు వల్ల చుట్టుపక్కల ఉన్న నివాసితులు, రైతులు, రజకులు నానా ఇబ్బం దులు పడుతున్నారని పట్టణ అధ్యక్షుడు జి.రవికుమార్, 2వ వార్డు మాజీ కౌన్సిలర్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు బి.సీతారాంలో విజయచంద్ర దృష్టికి తీసుకువచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను రోగాలపాలుజేసే ఇలాంటి డంపింగ్ యార్డు తరలించడంలో వైసీపీ ప్రజాపత్రినిధులు, అధికార పార్టీకి చెందిన మున్సిపల్ పాలకవర్గ సభ్యుల నిర్లక్ష్యమే కారణమన్నారు. డంపింగ్ యార్డు పరిధిలో ఉన్న 1వ, 2వ, 3వ వార్డులకు చెందిన ప్రాణాలు ముప్పు ఉందని, పలుసార్లు టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశామని చెప్పారు. సాలిడ్ వేస్టు మేనేజ్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజారోగ్యశాఖ అధికారులు మూలకు చేర్చారన్నారు. పొడి చెత్త రీసైక్లింగ్ చేపడితే పలువురు నిరుద్యో గులకు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంచి మార్గమని కమిషనర్ రామఅప్ప లనాయుడుకు చెబితే తన చేతుల్లో ఏమిలేదని, ప్రజా ప్రతినిధులు చెప్పిన ట్లే చేయాలని అనడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు పి.రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ ఎం.సత్యనారాయణ, నాయకులు కె.మధు, పి.మరియదాసు, డాక్టర్ భానుప్రసాద్ పాల్గొన్నారు.