బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు మాయం

ABN , First Publish Date - 2023-03-30T23:59:35+05:30 IST

తమకు తెలియకుండానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమైపోవడంతో ఇద్దరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట గ్రామానికి చెందిన సంగం శివార్జునరావు ఈ నెల 9 వతేదీన కొత్తవలస సబ్‌రిజస్ట్రార్‌ కార్యాలయంలో ఒక రిజి స్ట్రేషన్‌కు సంబంధించి సాక్షిగా ఉంటూ బయోమెట్రిక్‌ వేశాడు.

బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు మాయం

లక్కవరపుకోట, మార్చి 30: తమకు తెలియకుండానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమైపోవడంతో ఇద్దరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట గ్రామానికి చెందిన సంగం శివార్జునరావు ఈ నెల 9 వతేదీన కొత్తవలస సబ్‌రిజస్ట్రార్‌ కార్యాలయంలో ఒక రిజి స్ట్రేషన్‌కు సంబంధించి సాక్షిగా ఉంటూ బయోమెట్రిక్‌ వేశాడు. అక్కడి నుంచి వచ్చాక అదే రోజు సాయంత్రం ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతానుంచి 10 వేల రూపాయలు డెబిట్‌ అయినట్టు మెసేజ్‌ వచ్చింది. మళ్లీ మరుసటి రోజైన 10 వతేదీన, 11, 12 తేదీల్లో కూడా రోజూ 10 వేల చొప్పున అకౌంట్‌ నుంచి డబ్బులు మాయ మైనట్టు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఈ నెల 14న ఆయన సంబంధిత బ్యాంకు కార్యాలయానికి వెళ్లి దీనిపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యానికి వెళ్లి అక్కడి అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. అదే విధంగా ఎల్‌కోటకు చెందిన దొంతల శ్రీనివాసరావు గురువారం ఉదయం రూ.10వేలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌ రావడంతో స్థానిక ఎస్‌బీఐ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. వీరిద్దరూ ఎటువంటి విత్‌డ్రా, ఫోన్‌పే ద్వారా కానీ ఎటువంటి ట్రాన్జాక్షన్స్‌ చేయకపో యినప్పటికీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు మాయమైనట్లు గుర్తించారు. దీనిపై స్థానిక ఎస్‌ఐ ముకుందరావును వివరణ కోరగా ఈ విషయంపై దృష్టిసారించామని, ఇప్పటికే సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.

Updated Date - 2023-03-30T23:59:35+05:30 IST