ఎమ్మెల్సీ ఓటర్లు 2,87,258 మంది
ABN , First Publish Date - 2023-02-15T00:21:36+05:30 IST
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల తుది జాబితా మంగళవారం ఖరారైంది. ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకొని సోమవారం కొందరు పేర్లు నమోదు చేసుకోగా, అధికారులు మొత్తం ఆరు జిల్లాల్లోను 2,87,258 మంది ఓటర్లు ఉన్నారని లెక్క తేల్చారు. ఇందులో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,05,235 మంది ఉండగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 11,571 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,80,891 మంది కాగా మహిళలు 1,06,329 మంది, ట్రాన్స్‌జెండర్లు 38 మంది.
ఎమ్మెల్సీ ఓటర్లు 2,87,258 మంది
పురుషులు 1,80,891, మహిళలు 1,06,329, ట్రాన్స్‌జెండర్లు 38 మంది...
విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,05,235
అల్లూరి జిల్లాలో అత్యల్పం 11,571
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల తుది జాబితా మంగళవారం ఖరారైంది. ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకొని సోమవారం కొందరు పేర్లు నమోదు చేసుకోగా, అధికారులు మొత్తం ఆరు జిల్లాల్లోను 2,87,258 మంది ఓటర్లు ఉన్నారని లెక్క తేల్చారు. ఇందులో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,05,235 మంది ఉండగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 11,571 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,80,891 మంది కాగా మహిళలు 1,06,329 మంది, ట్రాన్స్‌జెండర్లు 38 మంది.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కాగా ఈ నెల 16 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 27 వరకు గడువు ఉంటుంది. వచ్చే నెల మార్చి 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే నెల 16వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు.
జిల్లా వారీగా ఓటర్ల వివరాలు
---------------------------------------------------------------------------------------------------
జిల్లా పురుషులు మహిళలు ట్రాన్స్‌జెండర్లు మొత్తం
----------------------------------------------------------------------------------------------------
1. శ్రీకాకుళం 36,361 15,830 5 52,196
2. విజయనగరం 38,556 19,817 9 58,382
3. పార్వతీపురం మన్యం 12,399 5,959 2 18,360
4. అల్లూరి సీతారామరాజు 7,894 3,674 3 11,571
5. విశాఖపట్నం 58,105 47,117 13 1,05,235
6. అనకాపల్లి 27,576 13,932 6 41,514
------------------------------------------------------------------------------------------------------
మొత్తం 1,80,891 1,06,329 38 2,87,258
------------------------------------------------------------------------------------------------------
1111111111111111111111111111