ABN , First Publish Date - 2023-11-10T00:06:57+05:30 IST
బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విక్రమ్ ఏసుకు నాలుగేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు న్యాయాధికారి కె.నాగమణి గురువారం తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక పట్ల అసభ్య ప్రవర్తన
నిందితునికి నాలుగేళ్ల జైలు
విజయనగరం క్రైం/ బొబ్బిలి నవంబరు 9: బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విక్రమ్ ఏసుకు నాలుగేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు న్యాయాధికారి కె.నాగమణి గురువారం తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి పట్టణంలోని ఓంకార్ థియేటర్ వీధికి చెందిన విక్రమ్ ఏసు ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నేరానికి 2019 అక్టోబరు 29న బొబ్బిలి పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 8 ఆఫ్ పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అప్పటి మహిళా ఎస్ఐ కేటీఆర్ లక్ష్మి కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన అనంతరం నిందితునికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయాధికారి నాగమణి తీర్పు చెప్పారు. ఈ కేసులో స్పెషల్ పీపీగా ఎం.శంకరరావు వ్యహరించినట్లు హెచ్సీ సీహెచ్ స్వామినాయుడు తెలిపారు.