ఎంఈవో కార్యాలయ సిబ్బంది నిరసన
ABN , First Publish Date - 2023-08-22T00:08:24+05:30 IST
పనికి తగ్గ వేతనం, ఎంటీఎస్‌తో పాటు, తమ ఉద్యో గాలను తక్షణమే రెగ్యులర్ చేయాలని స్థానిక ఎంఈవో కార్యాలయ సిబ్బంది సో మవారం నిరసన వ్యక్తం చేశారు.
రేగిడి: పనికి తగ్గ వేతనం, ఎంటీఎస్‌తో పాటు, తమ ఉద్యో గాలను తక్షణమే రెగ్యులర్ చేయాలని స్థానిక ఎంఈవో కార్యాలయ సిబ్బంది సో మవారం నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కమిటీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో యునియన్ ప్రతినిధులు ఎంఐసీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, అకౌంటెంట్ సూర్యారావు ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని వీరు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సీఆర్‌పీ మోహనరావు, డేటా ఆపరేటర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.