పూరిపాకల తొలగింపునకు చర్యలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:06 AM
జూట్ మిల్లుకు సమీపంలో నెల్లిమర్ల - పాలకొండ రోడ్డును ఆను కొని రైల్వే స్థలంలో ఉన్న పూరిపాకలను తొలగిం చేందుకు విజయనగరం ఆర్‌పీఎఫ్ అధికారు లు శనివారం చర్యలు చేప ట్టారు. దీంతో శనివారం ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నెల్లిమర్ల, డిసెంబరు 16: జూట్ మిల్లుకు సమీపంలో నెల్లిమర్ల - పాలకొండ రోడ్డును ఆను కొని రైల్వే స్థలంలో ఉన్న పూరిపాకలను తొలగిం చేందుకు విజయనగరం ఆర్‌పీఎఫ్ అధికారు లు శనివారం చర్యలు చేప ట్టారు. దీంతో శనివారం ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. దశాబ్దాలుగా రోడ్డు పక్కన పాకలు వేసుకుని జీవిస్తున్న వారు ఒక్కసారిగా వాటి తొలగింపునకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టడంతో హతాశులయ్యారు. అధికారులు ఆ ప్రాంతానికి పొక్లెయినర్‌ను తీసుకురావడంతో యంత్రానికి అడ్డంగా కూర్చున్నా రు. దీంతో స్థానిక పోలీసుల సహకారంతో తొలగింపునకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకుడు చిక్కాల సాంబశివరావు అక్కడికి చేరుకుని పేదల తరఫున మాట్లాడారు. పాకల తొలగింపును తాము వ్యతిరేకించడం లేదని... జనవరి 20వ వరకు గడువు అడుగుతున్నామని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో రీసర్వే చేసి రైల్వే సరిహద్దులను గుర్తించాలని, అప్పటికీ పాక లు రైల్వే స్థలంలో ఉంటే బాధితులకు వేరే స్థలాన్ని చూపించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్‌ఐ బి.శ్రీధర్, తదితరులు చిక్కాల కోరిన గడువుకు అంగీకరించి వెనుదిరిగారు.