వెయిట్‌ లిఫ్టింగ్‌లో మణికంఠ సత్తా

ABN , First Publish Date - 2023-06-03T00:30:27+05:30 IST

చంద్రంపేట గ్రామానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారుడు మొయిద మణికంఠ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటాడు.

  వెయిట్‌ లిఫ్టింగ్‌లో మణికంఠ సత్తా

నెల్లిమర్ల: చంద్రంపేట గ్రామానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారుడు మొయిద మణికంఠ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని నొయిడాలోని గౌతమ బుద్ధ యూనివర్శిటీలో జరుగుతున్న జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో 89 కిలోల కేటగిరీలో పాల్గొన్న మణికంఠ స్నాచ్‌లో 130 కిలోల బరువు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 154 కిలోల బరువు ఎత్తి కాంస్య పతకం సాధించాడు. విజయనగరం సత్య డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బీఏ చదువుతున్న మణికంఠ ఆంధ్ర యూనివర్శిటీ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్నాడు. మణికంఠ జాతీయ స్థాయి విజేతగా నిలవడం పట్ల కోచ్‌ చల్లా రాముతో పాటు వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ బీఎస్‌ఆర్‌ మూర్తి, లక్ష్మి అభినందించారు.

Updated Date - 2023-06-03T00:30:27+05:30 IST