విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-09-23T00:12:15+05:30 IST

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన రాజాం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

రాజాం రూరల్‌, సెప్టెంబరు 22: విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన రాజాం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థాని కులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంతకవిటి మండలం ఇజ్జి పేట గ్రామానికి రాంబాబు (40) పట్టణంలోని శ్రీకాకుళం రోడ్‌లో వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వాహనాలను సర్వీసింగ్‌ చేస్తుండగా అక్కడ విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. ఈ ఘట నలో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని పరిశీలించారు. మృతుడి భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాజాం ఏఎస్‌ఐ భాస్కరరావు తెలిపారు. రాంబాబుకు ఇద్దరు పిల్లలున్నారు.

Updated Date - 2023-09-23T00:12:15+05:30 IST