మహిళా సంక్షేమం కోసమే ‘మహాశక్తి’

ABN , First Publish Date - 2023-08-22T00:14:35+05:30 IST

మహిళా సంక్షేమం కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు మహాశక్తి పథకాలను రూపొందించారని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి అన్నారు.

మహిళా సంక్షేమం కోసమే ‘మహాశక్తి’
గాంధీనగర్‌ కాలనీలో కరపత్రాలతో ప్రచారం చేస్తున్న బంగార్రాజు, వనజాక్షి

నెల్లిమర్ల: మహిళా సంక్షేమం కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు మహాశక్తి పథకాలను రూపొందించారని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి అన్నారు. నగర పంచాయతీ పరిధి 12, 13, 14 వార్డుల్లోని శెగిడిపేట, గాంధీనగర్‌కాలనీ ప్రాంతాల్లో వనజాక్షి ఆధ్వర్యంలో సోమవారం మహాశక్తి కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. టీడీపీ ప్రభుత్వంతోనే మహిళల సంక్షేమం సాధ్య మని తెలిపారు. నగర పంచాయతీ కమిటీ అధ్యక్షురాలు బయిరెడ్డి లీలావతి, జిల్లా కార్యదర్శి లెంక హైమావతి, జిల్లా అధికార ప్రతినిధి కింతాడ కళావతి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చిల్లా పద్మ, స్థానిక కౌన్సిలర్లు ముడిమంచి లక్ష్మి, మజ్జి అన్నపూర్ణ, రెడ్డి సంతోషికుమారి, పార్టీ నాయకులు కేఎన్‌ ఎం కృష్ణారావు, ముడిమంచి లక్ష్మణరావు, మజ్జి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ సీతంపేట: మహిళలకు భద్రత, భరోసా టీడీపీతోనే సాధ్య మని పార్టీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. కుడ్డపల్లి పంచాయతీలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బిడ్డిక చంద్రరావు, నిమ్మక నాగేశ్వరరావు, నిమ్మక కృష్ణ, సింహాద్రి, ఊయక రామ్మూర్తి, ఆరిక చిన్నారావు, మూటక రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఫ పార్వతీపురం టౌన్‌: చంద్రబాబు పాలనతోనే మహిళా సాధికారికత సాధ్య మని టీడీపీ పార్వతీపురం నియోజవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం వైకేఎం కాలనీలో మాజీ ఎమ్మెల్సీ డి.జగదీష్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డి.శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళా శక్తి కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి.రవికుమార్‌, యువజన విభాగం కార్యదర్శి ఎస్‌.భాస్కరరావు, కౌన్సిలర్లు బి.గౌరునాయుడు, టి.వెంకటరావు, మాజీ కౌన్సిలర్‌ ఎం.సత్యనారా యణ తదితరులు పాల్గొన్నారు. ఫ గుమ్మలక్ష్మీపురం: చీమలగూడ గ్రామం లో మహాశక్తి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ గిరిజనులు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలన్నారు. టీడీపీ నాయకులు వెంకటరావు, పోలూరు శ్రీనివాసరావు, నాగవేణి, కళావతి తదితరులు పాల్గొన్నా రు. ఫ సీతానగరం: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సంక్షేమం సాధ్యమవుతుందని పార్వతీపురం నియోజకవర్గం ఇన్‌చార్జి బి.విజ యచంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు. మహాశక్తి కార్యక్రమంలో భాగంగా సోమవారం అంటిపేట గ్రామంలో ర్యాలీ నిర్వహిం చారు. గ్రామంలోని పార్టీ నాయకులను ఇన్‌చార్జి పరిచయం చేసుకున్నారు. తెలుగు మహిళలతో కలిసి మహాశక్తి పథకంపై ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ శ్రీదేవి, పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:14:35+05:30 IST