కలిసికట్టుగా టీడీపీని గెలిపించుకుందాం

ABN , First Publish Date - 2023-05-26T00:04:23+05:30 IST

నెల్లిమర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు పిలుపునిచ్చారు.

కలిసికట్టుగా టీడీపీని గెలిపించుకుందాం

పూసపాటిరేగ: నెల్లిమర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు పిలుపునిచ్చారు. చల్లవానితోట గ్రామంలోని తన స్వగృహంలో నియోజ కవర్గ స్థాయి పార్టీ సమావేశాన్ని ఆయన ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి పార్టీ శ్రేణులంతా ఒక్కటై కృషి చేయాలని నాలుగు మండలాల నాయకులు సూచించారు. పార్టీ ఎవరిని అభ్యర్థిగా సూచించినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్టీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు కష్టపడాలని ఆయన కోరారు. అనంతరం నెల్లిమర్ల నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ కర్రోతు బంగా ర్రాజును పతివాడతో పాటు నాలుగు మండలాల నాయకులు ఘనంగా సత్కరించా రు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహంతి చిన్నంనాయుడు, సువ్వాడ రవిశేఖర్‌, కంది చంద్రశేఖర్‌, ఆకిరి ప్రసాద రావు, పతివాడ తమ్మినాయుడు, పార్టీ పూసపాటి రేగ మండల అధ్యక్షుడు మహంతి శంకరరావు, నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:04:23+05:30 IST