Share News

సమన్వయంతో ముందుకుసాగుదాం

ABN , First Publish Date - 2023-10-30T01:48:33+05:30 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడి పొత్తుతో కుటుంబ సభ్యుల్లా ముందుకు సాగాలని మరోసారి నిర్ణయించాయి. రెండు పార్టీల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం విజయనగరంలోని ఓ హోటలో నిర్వహించాయి. ఇరు పార్టీల నుంచి కీలక నేతలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేద్దామని శపథం చేశారు.

సమన్వయంతో ముందుకుసాగుదాం

సమన్వయంతో ముందుకుసాగుదాం

ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ, జనసేన నేతల శపథం

సమన్వయ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చ

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడి పొత్తుతో కుటుంబ సభ్యుల్లా ముందుకు సాగాలని మరోసారి నిర్ణయించాయి. రెండు పార్టీల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం విజయనగరంలోని ఓ హోటలో నిర్వహించాయి. ఇరు పార్టీల నుంచి కీలక నేతలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేద్దామని శపథం చేశారు. కుటుంబ సభ్యుల మాదిరిగా ఎటువంటి పొరపొచ్చాలు, గ్రూపులు, అభిప్రాయభేదాలకు తావులేకుండా ఎన్నికలను ఎదుర్కొందామని నిర్ణయించాయి. అధిష్టానం సీట్లు ఎవరికి కేటాయించినా ఉమ్మడి అభ్యర్థి గెలుపుకోసం అహర్నిశలూ పనిచేయాలని తీర్మానించాయి. సమావేశానికి టీడీపీ నుంచి ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, పొలిట్‌ బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌, టీడీపీ ఇన్‌చార్జిలు కర్రోతు బంగార్రాజు, గుమ్మిడి సంధ్యారాణి, కేఏ నాయుడు, బేబీనాయన, కోళ్ల లలితకుమారి, కురుపాం నుంచి తోయిక జగదీశ్వరి, బోనెల రవిచంద్ర(పార్వతీపురం), మాజీ ఎమ్మెల్యేలు భంజ్‌దేవ్‌, బొబ్బిలి చిరంజీవులు, తెంటు లక్షుంనాయుడు తదితరులు హాజరయ్యారు. జనసేన నుంచి పడాల అరుణ, లోకం మాధవి తదితర నాయకులు హాజరయ్యారు.

- ఉమ్మడి జిల్లా నేతల సమావేశం అనంతరం టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, జనసేన ప్రతినిధి కోన తాతారావులు సమన్వయకర్తలుగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు టీడీపీ-జనసేన పార్టీలు కలిసి కార్యాచరణను రూపొందిస్తున్నామని వెళ్లడించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులు, అణచివేతలు, అన్ని వ్యవస్థల నిర్వీర్యం, వైసీపీ నాయకుల అరాచకాలు, నిత్యావసరాల ధరలు, కరువు పరిస్థితులు, సంక్షేమం పేరుతో అక్రమాలు, మద్యం ధరలతో దోపిడీ, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు తదితర అంశాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. రెండు పార్టీల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించామని వెళ్లడించారు. ఇరు పార్టీల నాయకుల సమష్టి ఆలోచనలు, సలహాలు, సూచనలతో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.

-----------------------------

Updated Date - 2023-10-30T01:48:33+05:30 IST