అరాచక పాలనకు చరమగీతం పాడుదాం
ABN , First Publish Date - 2023-02-20T23:50:32+05:30 IST
వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమ గీతం పాడాల ని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.
రాజాం: వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమ గీతం పాడాల ని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి శ్యాంపురం గ్రామం లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈసంద ర్భంగా జిల్లా పార్లమెంటరీ నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షుడు గురవాన నారాయణరావు వైసీపీ ప్రభుత్వం చేస్తు న్న అన్యాయాలను, అక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో చీడి రమేష్, పొన్నాడ భీమేశ్వరరావు, రఘుమండల గణపతినాయుడు, బోనెల నారాయణరావు, బట్న సూర్యనారాయణ, చీడి కుమార్, భూషణ్‌నాయు డు, మాడుగుల జయరాం, బొత్స మురళి, తదితరులు పాల్గొన్నారు.
దుష్టపాలన నుంచి విముక్తి కల్పించు స్వామీ
శృంగవరపుకోట రూరల్: జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే ఈ దుష్టపా లన నుంచి ప్రజలను విముక్తి చేసి, వారికి శాంతి, సంతోషం ప్రసాదించాలని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సన్యాసేశ్వరస్వామిని వేడుకున్నారు. సోమవారం మండలం లోని ధర్మవరం సమీపంలోని ప్రాచీనశైవక్షేత్రం ధర్మవరం సన్యాసేశ్వర ఆలయాన్ని పంచాయతీ సర్పంచ్ గాలి సన్యాస య్య ఆధ్వర్యంలో దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం లలిత కుమారిని సత్కరించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.