Share News

భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

ABN , First Publish Date - 2023-11-27T00:11:05+05:30 IST

జిల్లా ప్రజలు ఆదివారం కార్తీక పౌర్ణమిని భక్తిశ్రద్ధలతో జరుపుకొ న్నారు. విజయనగరం, బొబ్బిలి, ఎస్‌.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గరివిడి, డెంకాడ, గజపతినగరం తదితర మండలాల్లో కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు.

 భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి
డెంకాడ శివాలయంలో జ్వాలా తోరణం

- ఆలయాల వద్ద జ్వాలాతోరాణాలు

- రామానారాయణంలో ఘనంగా దీపోత్సవం

విజయనగరం (ఆంధ్రజ్యోతి), నవంబరు 26: జిల్లా ప్రజలు ఆదివారం కార్తీక పౌర్ణమిని భక్తిశ్రద్ధలతో జరుపుకొ న్నారు. విజయనగరం, బొబ్బిలి, ఎస్‌.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గరివిడి, డెంకాడ, గజపతినగరం తదితర మండలాల్లో కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉసవాస దీక్షలు చేపట్టారు. పలువురు నోములు నోచారు. వాయనాలు ఇచ్చారు. గజపతినగరం మండలం గంగచోళ్ల పెంట గ్రామంలోని పురాతన ఆలయం వద్ద, డెంకాడ, బొండపల్లి, గంట్యాడలోని శివాలయాల వద్ద, విజయనగరంలోని కన్యకాపరమేశ్వరీ, వీరరాజేశ్వరీ, ఉమా రామలింగేశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో జ్వాలా తోరణాలు వైభవంగా నిర్వహించారు. జ్వాలా తోరణాలు చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. అంతకుముందు శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. విజయనగరం మండలం రామనారాయ ణంలో కార్తీకదీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రామబాణం ఆకారంలో దీపాలను వెలిగించారు. ఆకాశంలో నిండుపున్నమి వెలుగులు విరాజిల్లాయి..

Updated Date - 2023-11-27T00:11:07+05:30 IST