Share News

ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:12 AM

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కోరారు. కొద్దిరోజులు సమస్యలు పరిష్కారం కోసం కలెక్టరేట్‌ వద్ద సమ్మె నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం మోకాళ్లపైౖ నిలబడి మోకాళ్లపైౖ నిలబడి ప్రభుత్వానికి దండం పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. వీరికి ఏపీటీఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా సంఘ నాయకులు బంకురు జోగి నాయుడు మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ లీవులు మంజూరు చేయాల న్నారు.కాగాసాయంత్రం విశాఖలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆయా ఉద్యోగ సంఘ నాయకులతో జరిపిన చర్చలు విఫలంకావడంతో యధావిఽధిగా సమ్మె కొనసాగుతుందని యూనియన్‌ నాయకులు వెల్లడించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి
కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు :

కలెక్టరేట్‌: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కోరారు. కొద్దిరోజులు సమస్యలు పరిష్కారం కోసం కలెక్టరేట్‌ వద్ద సమ్మె నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం మోకాళ్లపైౖ నిలబడి మోకాళ్లపైౖ నిలబడి ప్రభుత్వానికి దండం పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. వీరికి ఏపీటీఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా సంఘ నాయకులు బంకురు జోగి నాయుడు మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ లీవులు మంజూరు చేయాల న్నారు.కాగాసాయంత్రం విశాఖలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆయా ఉద్యోగ సంఘ నాయకులతో జరిపిన చర్చలు విఫలంకావడంతో యధావిఽధిగా సమ్మె కొనసాగుతుందని యూనియన్‌ నాయకులు వెల్లడించారు.

విద్యార్థినులకు పూర్తిస్థాయిలో అందని భోదన

సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెచేయడంతో జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులకు పూర్తిస్థాయిలో బోధన అందడంలేదు. పీజీటీలతో కాలం నెట్టుకొస్తున్నారు. జిల్లాలోని 26 కేజీబీవీల్లోని సుమారు 200 మంది వరకూ సీఆర్‌టీలు సమ్మెలో పాల్గొంటున్నట్లు యూనియన్‌ నాయకులు చెబుతున్నారు.కాగా కేజీవీబీ విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా పీజీటీలు ద్వారా బోధిస్తున్నామని డీఈవో లింగేశ్వరరెడ్డి తెలిపారు.

Updated Date - Dec 31 , 2023 | 12:12 AM