31న పార్వతీపురంలో జాబ్‌మేళా
ABN , First Publish Date - 2023-05-26T00:04:58+05:30 IST
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 31న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సాయికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

పార్వతీపురం, మే25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 31న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సాయికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు రెండు తెలుగు రాష్ర్టాల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. 18 నుంచి 20 సంవత్సరాల లోపు వారు అర్హులని చెప్పారు. ఇతర వివరాలకు 91823 98325, 79972 99739 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.