జగన్‌వన్నీ మోసపూరిత విధానాలే
ABN , First Publish Date - 2023-04-03T00:29:57+05:30 IST
: సీఎం జగన్ రెడ్డి అందర్నీ మోసగించి అప్రజాస్వామిక పాలన కొనసాగి స్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు.
వంగర: సీఎం జగన్ రెడ్డి అందర్నీ మోసగించి అప్రజాస్వామిక పాలన కొనసాగి స్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. ఆదివారం రాజులగుమ్మడలో ఓ కార్యకర్త మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించారు. నిరుద్యోగ యువతను మోసగించారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞానవంతులు బుద్ధిచెప్పారన్నారు. అనేక మంది నిరుద్యోగ యువత రెండేళ్లలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. నాలుగేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆయ న వెంట టీడీపీ నాయకులు బోత్సవాసు దేవరావునాయుడు, పైల వెంకటరమణ, త్రినాథ తదితరులు ఉన్నారు.