రైతులను ముంచిన జగన్‌

ABN , First Publish Date - 2023-07-08T23:54:12+05:30 IST

దిక్కుమాలిన, సిగ్గుమాలిన సీఎం జగన్‌ తన అసమర్థ పాలనతో రైతుల పుట్టి ముంచాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కిమిడి కళావెంకటరావు ధ్వజమెత్తారు. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) ఆధ్వర్యంలో శనివారం బొబ్బిలి నియోజకవర్గంలో భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్ర జరిగింది.

రైతులను ముంచిన జగన్‌
కోమటిపల్లి సభలో మాట్లాడుతున్న టీడీపీ సీనియర్‌ నేత మాజీ మంత్రి కళావెంకటరావు

ఈ ప్రభుత్వంలో దళారులదే పెత్తనం

సబ్సిడీలు మాయం

చంద్రబాబు వస్తే మరెన్నో కొత్త పథకాలు

బొబ్బిలి బస్సుయాత్రలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు

బొబ్బిలి, జూలై 8: దిక్కుమాలిన, సిగ్గుమాలిన సీఎం జగన్‌ తన అసమర్థ పాలనతో రైతుల పుట్టి ముంచాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కిమిడి కళావెంకటరావు ధ్వజమెత్తారు. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) ఆధ్వర్యంలో శనివారం బొబ్బిలి నియోజకవర్గంలో భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్ర జరిగింది. తొలుత తెర్లాం మండలంలో పర్యటించిన టీడీపీ నాయకులు అనంతరం బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో బహిరంగసభలో మాట్లాడారు. కళావెంకటరావు ప్రసంగిస్తూ జగన్‌ తీరును ఎండగట్టారు. రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసిన జగన్‌ రైతులను సైతం విడిచి పెట్టలేదని, పీల్చిపిప్పిచేసి నమిలి మింగేశాడన్నారు. మాయదారి ప్రభుత్వంలో దళారీలదే పెత్తనమని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్ముకోడానికి ఏనాడైనా అన్నదాతలు పడిగాపులు కాశారా? అని ప్రశ్నించారు. ఆ ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4 వేల కోట్ల రూపాయల వ్యవసాయ సబ్సిడీలు ఇచ్చామని, వాటన్నింటినీ జగన్‌ మాయం చేశాడన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలన్నిటినీ కొనసాగిస్తూనే మరెన్నో వినూత్న పథకాలను అమలు చేయడం ఖాయమని చెప్పారు. అనంతరం మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి మాట్లాడుతూ జగన్‌ పాలనలో హింస, దాడులకు ప్రత్యేకమని, వాటికి వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటానికి నడుంబిగించాలన్నారు. చంద్రబాబు మార్కు అభివృద్ధిని మనం సాధించుకోవాలని చెప్పారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ విజన్‌ లేని ముఖ్యమంత్రి జగన్‌ అని, రాష్ర్టాన్ని సర్వనాశనం చేశాడని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ మళ్లీ ఈ అరాచకపాలనకు ప్రజలు పట్టం కడితే మన వారసులెవరూ క్షమించబోరని అన్నారు. టీడీపీ బొబ్బిలి ఇన్‌చార్జి బేబీనాయన మాట్లాడుతూ బీటెక్‌ చదువుకున్న వారు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారంటే అది జగన్‌ పరిపాలనకు మాయని మచ్చ అని, ఒక్కచాన్స్‌ అని నెత్తికి ఎక్కాడని ఎద్దేవా చేశారు. ధాన్యం, చెరకు రైతులకు నరకం చూపించాడని విమర్శించారు. చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరమని అన్నారు. సభలో పార్టీ జిల్లా పరిశీలకుడు నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, ఆర్‌పీ భంజ్‌దేవ్‌, కేఏ నాయుడు, కొప్పలవెలమ సాధికారిత చైర్మన్‌ అల్లు విజయ్‌కుమార్‌, బొబ్బిలి ప్రాంత నాయకులు చింతల రామకృష్ణ, వాసిరెడ్డి సత్యనారాయణ, రాంబార్కి శరత్‌బాబు, గెంబలి శ్రీనివాసరావు, సుంకరి సాయిరమేష్‌, బొత్స అప్పులు, కోమటిపల్లి గ్రామసర్పంచ్‌, ఎంపీటీసీలు ఇతర ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

తెర్లాంలో భారీ ర్యాలీ

తెర్లాం : భవిష్యత్తు గ్యారెంటీ బస్సుయాత్ర శనివారం పెరుమాళి గ్రామంలో ర్యాలీతో ప్రారంభమైంది. కార్యకర్తలు భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ చేపట్టారు. లోచర్లలో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బేబీనాయన మాట్లాడుతూ లోచర్ల గ్రామానికి చంద్రబాబునాయుడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమును మంజూరు చేయగా ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో ఎటువంటి అభివృద్ధీ చేయలేదన్నారు. అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు.

బస్సుయాత్ర సాగిందిలా..

బొబ్బిలి : బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్ర తెర్లాం మండలంలో శనివారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో మొదలైంది. బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చేరకున్న టీడీపీ నాయకులకు గ్రామస్థులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ బహిరంగ సభ తరువాత బొబ్బిలి కోటకు వచ్చారు. అనంతరం అన్నాక్యాంటీన్‌ను పరిశీలించారు. ఆ తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి మీదుగా రాజాకాలేజీ రోడ్డు, పూల్‌బాగ్‌, గొల్లపల్లి రోడ్ల తీరును చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి రామన్నదొరవలస సమీపంలోని టిడ్కోఇళ్ల వద్దకు వెళ్లి పార్టీ నాయకులందరూ సెల్ఫీ దిగారు. సాయంత్రం రామభద్రపురంలో మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తారాపురం ఎంపీటీసీ బెవర సునీత తదితర మహిళలు సమస్యలను విన్నవించారు. ఇటీవల కబ్జాకు గురైన భూములను నాయకులు పరిశీలించారు.

Updated Date - 2023-07-08T23:54:12+05:30 IST