అంగన్‌వాడీలపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2023-03-19T23:42:29+05:30 IST

అంగన్‌వాడీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం విజయవాడలో తలపెట్టిన మహా ధర్నాకు అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే గృహనిర్బంధం చేశారు. రోజంతా పోలీసులు వారి ఇంటి వద్దే కాపాలాగా ఉన్నారు.

అంగన్‌వాడీలపై ఉక్కుపాదం

అంగన్‌వాడీలపై ఉక్కుపాదం

చలో విజయవాడ అడ్డగింత

ప్రజాసంఘాల నేతల గృహనిర్బంధం

సాలూరు/సాలూరు రూరల్‌/పార్వతీపురం టౌన్‌/కొమరాడ, మార్చి 19: అంగన్‌వాడీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం విజయవాడలో తలపెట్టిన మహా ధర్నాకు అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే గృహనిర్బంధం చేశారు. రోజంతా పోలీసులు వారి ఇంటి వద్దే కాపాలాగా ఉన్నారు. సాలూరులో సీఐటీయూ నాయకుడు ఎన్‌వై నాయుడు, సంఘ నాయకులు రాధ, టి.ప్రభావతి,మక్కువ మండలం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సీహెచ్‌.తవిటినాయుడు, కొమరాడలో జయమ్మనులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పార్వతీపురంలో సీఐటీయూ నేత జీవీ రమణను సైతం గృహనిర్బంధం చేశారు. కాగా సాలూరు మండలం నుంచి విజయవాడ వెళుతున్న 15 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు ప్రుయత్నిస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. ఇంతలా కార్మికులను గొంతునొక్కడం ఎప్పుడూ లేదన్నారు. ప్రభుత్వానికి ప్రజా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అంగన్‌వాడీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-19T23:42:29+05:30 IST