దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2023-03-19T00:02:36+05:30 IST

పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో సీతానగరం మండలం జోగింపేటలో నిర్వహిస్తున్న స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పీవో విష్ణుచరణ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో సీతానగరం మండలం జోగింపేటలో నిర్వహిస్తున్న స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పీవో విష్ణుచరణ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్‌ 18లోగా దరఖాస్తులు పంపించాలని సూచించారు. 8వ తరగతిలో 45సీట్లు, ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో 45, బైపీసీలో 45 సీట్లు భర్తీచేయనున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం , విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు, పశ్చిమ గోదావరి ,కాకినాడ తదితర జిల్లాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 23న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 94909 57218, 94401 03332, 94909 71090 ఫోన్లకు సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2023-03-19T00:02:36+05:30 IST