ఉచిత శిక్షణకు ఇంటర్య్వూలు

ABN , First Publish Date - 2023-05-26T00:00:16+05:30 IST

స్థానిక జీఎంఆర్‌ నైరెడ్‌లో ఉచిత శిక్షణకు ఈనెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు నైరెడ్‌ పీవో నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉచిత శిక్షణకు ఇంటర్య్వూలు

రాజాం: స్థానిక జీఎంఆర్‌ నైరెడ్‌లో ఉచిత శిక్షణకు ఈనెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు నైరెడ్‌ పీవో నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. స్త్రీలకు హోం నర్శింగ్‌, లేడీస్‌ టైలరింగ్‌, పురుషులకు ఫోటోగ్రఫీ అండ్‌ వీడియో గ్రఫీ, సీసీటీవీ కెమెరా ఇన్‌స్టాలేషన్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ రంగాల్లో 30 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. 19 నుం చి 40 ఏళ్లు లోపు వయస్సుగల నిరుద్యోగ యువత ఇంట ర్వ్యూలకు 10 తరగతి సర్టిఫికెట్‌, ఆధార్‌, మిగిలిన ధ్రువప త్రాలు తీసుకుని ఉదయం 10 గంటలకు హాజరు కావాలని నాగరాజు సూచించారు. శిక్షణ కార్యక్రమం జూన్‌ 1 వతేదీ నుంచి మొదలవుతుందని, 94917 41129, 98669 13371, 90147 16255 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Updated Date - 2023-05-26T00:00:16+05:30 IST