ఖండ్యాం రోడ్డు పరిశీలన
ABN , First Publish Date - 2023-09-22T00:12:14+05:30 IST
ఖండ్యాం రోడ్డును ఎంపీడీఓ శ్యామలా కుమారి గురువారం పరిశీలించారు. బ స్సు సౌకర్యం లేక తాము పడుతున్న ఇబ్బందులపై విద్యార్థులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
రేగిడి, సెప్టెంబరు 21: ఖండ్యాం రోడ్డును ఎంపీడీఓ శ్యామలా కుమారి గురువారం పరిశీలించారు. బ స్సు సౌకర్యం లేక తాము పడుతున్న ఇబ్బందులపై విద్యార్థులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీకి సూచించారు. ఆర్టీసీ అధికారులు ఈ రూట్‌లోని ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పరిశీలించాలని ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించటంతో గురువారం రహదారి పరిస్థితిని చూశారు. బస్సులు నిలపడానికి స్థలం కేటాయించేందుకు గ్రామస్తులు ముందుకు వచ్చారు. వండానిపేట వద్ద ఉన్న రోడ్డు పరిస్థితిని కొలతలు వేసి ఆమె అంచనా వేశారు. బస్సు సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్‌కు నివేదిస్తామని ఆమె తెలిపారు. అనంతరం ఖండ్యాం సచివాలయాన్ని ఎంపీడీఓ తనిఖీ చేశారు. వలంటీర్ల పనితీరులో లోపం ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే సరిచేసుకోవాలని... దీనిపై కార్యదర్శి బాధ్యత వహించాలని ఆదేశించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, ప్రజలకు, నేతలకు జవాబుదారీగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఆమె వెంట ఈవోఆర్డీ హేమసుందరరావు ఉన్నారు.