కుమ్మపల్లి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌పై విచారణ
ABN , First Publish Date - 2023-06-26T23:55:58+05:30 IST
మండలంలోని కుమ్మపల్లి గ్రామ ఉపాధి హమీ పథకం క్షేత్ర సహాయ కురాలు దాసరి పార్వతిపై శృంగవరపుకోట క్లస్టర్ ఉపాధి ఏపీడీ శారదాదేవి సోమ వారం గ్రామ సభ నిర్వహించి, బహిరంగ విచారణ చేపట్టారు.
వేపాడ: మండలంలోని కుమ్మపల్లి గ్రామ ఉపాధి హమీ పథకం క్షేత్ర సహాయ కురాలు దాసరి పార్వతిపై శృంగవరపుకోట క్లస్టర్ ఉపాధి ఏపీడీ శారదాదేవి సోమ వారం గ్రామ సభ నిర్వహించి, బహిరంగ విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులను పిలిచి క్షేత్ర సహాయకురాలిపై వచ్చిన ఆరోపణల గురించి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు ఫీల్డు అసిస్టెంట్ వల్ల జరిగిన నష్టాన్ని ఏపీ డీకి వివరించారు. గ్రామ సర్పంచ్ నవుడు, ఉపసర్పంచ్ అరుణ, పైల కన్నంనాయుడు, నౌడు శ్రీను తదితరులు కూడా క్షేత్ర సహాయకురాలిపై ఫిర్యాదు చేసారు. ఈవిషయమై ఏపీడీని వివరణ కోరగా ఫీల్డు అసిస్ట్టెంట్‌పై వచ్చిన ఆరోపణలై చైపట్టిన విచారణను పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదికను తయారు చేసి ఉపాధిహమీ పఽథకం పీడీకి సమ ర్పిస్తామన్నారు.