‘ఎంపీడీవో తీరుపై దీక్ష చేస్తా’

ABN , First Publish Date - 2023-03-18T23:57:24+05:30 IST

మార్లాపల్లి గ్రామంలో తాగునీటి కొళాయిల వ్యవహారంలో ఎంపీడీవో కె.రూపేస్‌ తీరును నిరసిస్తూ సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడుతున్నట్టు ఆ గ్రామ సర్పంచ్‌ గోగాడ సత్యం తెలిపారు.

‘ఎంపీడీవో తీరుపై దీక్ష చేస్తా’

లక్కవరపుకోట: మార్లాపల్లి గ్రామంలో తాగునీటి కొళాయిల వ్యవహారంలో ఎంపీడీవో కె.రూపేస్‌ తీరును నిరసిస్తూ సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడుతున్నట్టు ఆ గ్రామ సర్పంచ్‌ గోగాడ సత్యం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. గ్రామంలో పంచాయతీ తీర్మానం లేకుండా నియంతృత్వ ధోరణిలో ఎంపీడీవో ఆదే శాలు ఇస్తూ తాగునీటి కొళాయిలు గ్రామంలో ఏర్పాటు చే సేందుకు అధికార పార్టీ నేతలలకు ఎంపీడీవో ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ఎన్నికల కోడ్‌ పూర్తయ్యేవరకు ఎటువంటి పనులు చేయరాదని చెప్పినట్టు పంచాయతీ కార్యదర్శికి, ఇతర అధికారులకు ఉత్తర్వులు ఇచ్చామని ఎంపీడీవో చెప్పడంపై సర్పంచ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవైపు పనులు చేపట్టొద్దని చెబుతూనే మరోవైపు పనులకు అనుమతులు ఇవ్వడంపై సర్పంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతో ఎంపీడీవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నిరసన దీక్ష చేయనున్నట్టు ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2023-03-18T23:57:24+05:30 IST