Share News

ఆకట్టుకున్న హరికథా గానం

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:22 AM

రాజాసాహెబ్‌ డాక్టర్‌ పీవీజీ రాజు శతజ యంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కోట ప్రాంగణంలోని రౌండ్‌ మహాల్‌లో మాన్సాస్‌ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శతజయంతి కార్యక్రమాన్ని నిర్వ హించారు

ఆకట్టుకున్న హరికథా గానం

విజయనగరం రూరల్‌: రాజాసాహెబ్‌ డాక్టర్‌ పీవీజీ రాజు శతజ యంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కోట ప్రాంగణంలోని రౌండ్‌ మహాల్‌లో మాన్సాస్‌ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శతజయంతి కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రముఖ భాగవతారిణి జయంతి సావిత్రి ఆధ్వర్యం లో హరికథాగానం నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి నగర ప్రముఖులు, పలు వురు సాహితీ, కళాకారులు హాజరయ్యారు. మా న్సాస్‌ చైర్మన్‌ అశోక్‌ గజపతి రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎంతో మంది మహానుభావులు నడయాడిన నేల విజయనగరం అని, ఇది ఎంతో ప్రసిద్ధి కలిగిందన్నారు. కార్యక్రమం అనంతరం రాజుల చరిత్ర, విజ యనగరం చరిత్రను ఎంతో అద్భుతంగా హరికథాగానం చేసిన భాగవతా రాణిని జయంతి సావిత్రిని అశోక్‌ గజపతిరాజు, మాన్సాస్‌ కరస్పాడెంట్‌ంట్‌ కేవీ ఎల్‌ రాజు, మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌ సూర్యకాంతి, ప్రముఖ న్యాయవాది ఎస్‌ఎస్‌వీఆర్‌ఎం రాజు తదితరులు సత్కరించారు. కళా శాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:22 AM