కదలని గజరాజులు

ABN , First Publish Date - 2023-02-02T00:15:57+05:30 IST

మండలంలో రోజూ ఏదో ఒక చోట సంచరిస్తున్న గజరాజులు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి.

కదలని గజరాజులు
పసుకుడి తోటలో ఉన్న ఏనుగులు

భామిని: మండలంలో రోజూ ఏదో ఒక చోట సంచరిస్తున్న గజరాజులు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలను నష్టపరుస్తూ రైతులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు దిమ్మిడజోల , అనంతగిరి, భామిని ప్రాంతాల్లో హల్‌చల్‌ చేసిన ఏనుగులు బుధవారం పసుకుడి తోటకు చేరుకున్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న మొక్కజొన్న తోటను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మండలంలో 13 మంది ట్రాకర్లు ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అటవీశాఖాధికారులకు తెలియజేస్తున్నారు. కాగా ఇంకెన్నాళ్లు ఈ బాధలు పడాలని, తక్షణమే ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించాలని ఆయా గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-02-02T00:15:59+05:30 IST