అక్రమంగా రేషన్ కందిపప్పు విక్రయం
ABN , First Publish Date - 2023-11-20T00:19:31+05:30 IST
మండలంలో ఎంఆర్ నగరం రేషన్ డిపో డీలర్ బుగత సంతోష్‌కుమార్ 25 కిలోల రేషన్ కందిపప్పును ఆదివారం అదే గ్రామంలో జి.కోటేశ్వరరావు అనే వర్తకుడికి విక్రయిస్తుండగా గ్రామానికి చెందిన ఎన్.చిన్న, అప్పలనాయుడు, దుర్గాప్రసాద్, సింహాచలం తదితరులు పట్టుకున్నారు.

పార్వతీపురం రూరల్, నవంబరు 19: మండలంలో ఎంఆర్ నగరం రేషన్ డిపో డీలర్ బుగత సంతోష్‌కుమార్ 25 కిలోల రేషన్ కందిపప్పును ఆదివారం అదే గ్రామంలో జి.కోటేశ్వరరావు అనే వర్తకుడికి విక్రయిస్తుండగా గ్రామానికి చెందిన ఎన్.చిన్న, అప్పలనాయుడు, దుర్గాప్రసాద్, సింహాచలం తదితరులు పట్టుకున్నారు. ఈ విషయం వెంటనే వీఆర్వో సూర్యప్రతాప్‌కు సమాచారం అందించగా వీఆర్వో స్పందించి స్టేట్‌మెంట్ తీసుకొని సివిల్ సప్లై డీటీ వెంకటరమణకు అప్పగించారు. దీంతో వెంకటరమణ డీలర్ ఇంటికి వెళ్లి దర్యాప్తు నిర్వహించారు. డీలర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయాన్ని వీఆర్వో సూర్య ప్రతాప్ వద్ద ప్రస్తావించగా గ్రామంలో హార్డ్‌వేర్ దుకాణం వద్ద డీలర్ 25 కేజీల కందిపప్పు ఉంచారని దీనిని కొంతమంది పట్టుకుని తమకు సమాచారం అందించారని తెలిపారు.