బండరాయి జారితే..
ABN , First Publish Date - 2023-06-26T23:51:43+05:30 IST
ఘనసర వద్ద వంశధార వరద కాలువ నుంచి తొలగించిన బండరాళ్లును వాహనాల ద్వారా నిర్లక్ష్యంగా తరలిస్తున్నారు.
భామిని: ఘనసర వద్ద వంశధార వరద కాలువ నుంచి తొలగించిన బండరాళ్లును వాహనాల ద్వారా నిర్లక్ష్యంగా తరలిస్తున్నారు. అవి ఏ మాత్రం జారితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఘనసర సమీపంలో ఓ టిప్పర్‌లో బండరాళ్లను తరలించగా.. వాహనం వెనుక డోర్ లేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు , వాహనదారులు తీవ్ర భయాందోళన చెందారు. ఒక్కరాయి జారితే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో ఊహించలేమని అక్కడి వారు వాపోయారు. ఘనసర వరదకాలువ నుంచి చిన్నదిమిలి కూడలి వరకు బండరాళ్లు తరలిస్తున్న కాంట్రాక్టర్లు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనిపై బత్తిలి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్పందించాలని కోరుతున్నారు.