మనువాద భావజాలాన్ని తిప్పికొట్టాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2023-04-03T02:10:10+05:30 IST
పాలక ప్రభుత్వాలు మహిళల పట్ల అవలంబిస్తున్న మనువాద భావజాలాన్ని తిప్పి కొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.
విజయవాడ (ధర్నాచౌక్), ఏప్రిల్ 2: పాలక ప్రభుత్వాలు మహిళల పట్ల అవలంబిస్తున్న మనువాద భావజాలాన్ని తిప్పి కొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యూ) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విద్యా శిక్షణా తరగతులు స్థానిక దాసరిభవన్‌లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలపై ప్రజలు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళలను మోదీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని, సంఘటిత ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు 21 ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతాయన్నారు. పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జాతీయ సమితి కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తదితరులు మాట్లాడారు.