ఆగి ఉన్న లారీని ఢీకొట్టి..
ABN , First Publish Date - 2023-04-03T23:49:17+05:30 IST
ఆగి ఉన్న లారీని.. మరో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో తెలంగాణలోని నల్గొండకు చెందిన డ్రైవర్ రాములు నాయక్ (48) దుర్మణం పాలయ్యాడు.
బొబ్బిలి (రామభద్రపురం): ఆగి ఉన్న లారీని.. మరో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో తెలంగాణలోని నల్గొండకు చెందిన డ్రైవర్ రాములు నాయక్ (48) దుర్మణం పాలయ్యాడు. రామభద్రపురంలో సోమవారం తెల్లవారుజా మున ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు సిమెంట్ లోడు తీసుకొని రాములునాయక్ వస్తున్నాడు. సోమవారం తెల్లవారు జామున రామభద్రపురం వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. కేబిన్‌లో చిక్కుకొని రాములునా యక్ ప్రాణాలు వదిలాడు. మృతుడిది నల్గొండలోని యేటకన్నారెడ్డి కాలనీ. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఆగి ఉన్న లారీకి సంబంధించి డ్రైవరు, ఇతర సిబ్బం ది ఎవరూ అక్కడ లేరు. అతి కష్టమ్మీద రాములునాయక్ మృతదేహాన్ని కేబిన్ నుంచి బయటకు తీయాల్సి వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేంద్రనాయుడు తెలిపారు.