విద్యుత్‌ చార్జీలతో వేధింపులా?

ABN , First Publish Date - 2023-06-26T23:54:13+05:30 IST

విద్యుత్‌ బిల్లుల పేరుతో అనేక చార్జీలను విధిస్తూ వైసీపీ ప్రభుత్వం వినియోగదారులను బెంబేలెత్తిస్తోందని పలువురు ప్రజాసంఘాల నాయ కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పౌరసంక్షేమసంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బృందావనం ఫంక్షన్‌హాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

విద్యుత్‌ చార్జీలతో వేధింపులా?

బొబ్బిలి, జూన్‌ 26: విద్యుత్‌ బిల్లుల పేరుతో అనేక చార్జీలను విధిస్తూ వైసీపీ ప్రభుత్వం వినియోగదారులను బెంబేలెత్తిస్తోందని పలువురు ప్రజాసంఘాల నాయ కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పౌరసంక్షేమసంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బృందావనం ఫంక్షన్‌హాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు పి.శంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రా ష్ట్ర టీడీపీ బీసీ విభాగం సంఘం నేత, ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నేత రౌతు రామ్మూర్తి వైసీపీ ప్రభుత్వం ప్రజారంజకంగా కాకుండా ఆందోళన కలిగించే విధంగా పరిపాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ఫిక్స్‌డ్‌, కస్టమర్‌, సర్దుబాటు, ట్రూఅప్‌ ఇలా అనేక రకాల పేరుతో అదనపు చార్జీలను ప్రజలపై మోపుతూ బాధిస్తోందన్నారు. ఇది చాలా అన్యాయమన్నారు. దీనికి తోడుగా స్మార్ట్‌మీటర్లను వినియోగదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటగడుతున్నాయన్నారు. శంకరరావు మాట్లాడుతూ వచ్చే నెల 1 నుంచి స్థానిక గ్రోత్‌సెంటర్‌లో పలు పరిశ్రమలు మూసివేతకు నిర్ణయించుకు న్నాయని, కేవలం విద్యుత్‌ భారం మోయలేకనే ఈ సమస్య వస్తోందన్నారు. పరిశ్ర మలు మూసివేస్తే సుమారు రెండువేల మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పో తారన్నారు. విద్యుత్‌ బిల్లుల సమస్యకు వ్యతిరేకంగా ఈ నెల 30న స్థానిక విద్యుత్‌ ఈఈ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని, వినియోగదారులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని శంకరరావు పిలుపునిచ్చారు. జేవీవీ జిల్లా నాయకుడు పోల సత్యంనాయుడు, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు గోనా భాస్కరరావు, మాజీ కౌన్సిలరు యెన్నా బాబు, కార్మిక నాయకులు జి.గౌరి, అంగన్‌వాడీ ప్రాజెక్టు యూనియన్‌ అధ్యక్షురాలు జె.కామేశ్వరి, రైతు సంఘం అధ్యక్షుడు గోపాల్‌, ఎస్‌.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:54:13+05:30 IST