పట్టా ఇచ్చారు.. స్థలం చూపండి!

ABN , First Publish Date - 2023-02-07T04:07:46+05:30 IST

జగనన్న ఇల్లు’ పథకం కింద తమకు పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలం ఎక్కడో చూపించలేదని, తమకు స్థలం చూపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును స్థానిక మహిళలు ప్రశ్నించారు.

పట్టా ఇచ్చారు.. స్థలం చూపండి!

‘గడపగడప’లో వెలంపల్లిని నిలదీసిన విజయవాడ మహిళలు

విజయవాడ(కేదారేశ్వరపేట), ఫిబ్రవరి 6: ‘జగనన్న ఇల్లు’ పథకం కింద తమకు పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలం ఎక్కడో చూపించలేదని, తమకు స్థలం చూపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును స్థానిక మహిళలు ప్రశ్నించారు. నియోజకవర్గంలోని 34వ డివిజన్‌, ఖుద్దూ్‌సనగర్‌లో సోమవారం ‘గడపగడపకు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. తమకు జగనన్న ఇల్లు వచ్చిందని, కానీ పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలం ఎక్కడ ఉందో చూపించలేదని శాంత కుమారి అనే మహిళ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన వెలంపల్లి.. రెండవ విడతలో ఇల్లు కట్టించి ఇస్తారని బదులిచ్చారు. అయితే, ఆ రెండవ విడత ఎప్పుడు వస్తుందని, ఇల్లు ఎప్పుడు ఇస్తారని శాంత కుమారి మళ్లీ ప్రశ్నించారు.

Updated Date - 2023-02-07T04:07:46+05:30 IST